Vijayawada: విజయవాడలో బీజేపీకి వ్యతిరేకంగా ప్లెక్సీల కలకలం

  • ప్లెక్సీలు పెట్టించిన కాట్రగడ్డ బాబు
  • కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరిక
  • మండిపడుతున్న బీజేపీ నేతలు
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం జరగనున్న సందర్భంగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేయించిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని బెంజ్ సర్కిల్, పాత బస్టాండ్, సచివాలయం సమీపంలో బీజేపీ వైఖరిని విమర్శిస్తూ ఈ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను నరేంద్ర మోదీ మరిపిస్తున్నారని, అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు టీడీపీకి కేవలం 13 నిమిషాలు కేటాయించారని ఈ ప్లెక్సీలపై ముద్రించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే రేపు బీజేపీకీ పడుతుందని హెచ్చరించారు. వీటిని ప్రజలు ఆసక్తిగా చూస్తుండగా, బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Vijayawada
BJP
Telugudesam
katragadda babu

More Telugu News