Narendra Modi: దేశమంతా మనల్నే చూస్తోంది... జాగ్రత్త: ఎంపీలకు నరేంద్ర మోదీ హెచ్చరిక

  • నేడు అవిశ్వాసంపై లోక్ సభలో చర్చ
  • నిర్మాణాత్మకంగా, సమగ్రంగా చర్చ సాగాలి
  • ట్విట్టర్ ఖాతాలో నరేంద్ర మోదీ
నేడు కేంద్రంపై జరగనున్న అవిశ్వాస తీర్మానాన్ని దేశ ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారని, ఎంపీలు జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టిన మోదీ, "ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ఎంతో ముఖ్యమైన రోజు. నిర్మాణాత్మకంగా, సమగ్రంగా, అవాంతరాలు లేకుండా చర్చ సాగాలని, అందుకు సహచర ఎంపీలంతా సహకరిస్తారని భావిస్తున్నాను. ప్రజలంతా మనల్ని చూస్తున్నారని గుర్తుంచుకోండి" అన్నారు.

కాగా, అన్నాడీఎంకే అవిశ్వాసానికి వ్యతిరేకంగాను, బిజూ జనతాదళ్, టీఆర్ఎస్ వంటి పార్టీలు ఓటింగ్ కు దూరంగాను ఉండాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం ఆరు గంటలకు పైగా చర్చ సాగనుండగా, సగం సమయానికన్నా అధికంగానే బీజేపీ వాడుకోనుంది. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ కు అన్నీ ఇచ్చామని చెప్పడమే లక్ష్యంగా బీజేపీ నేతలు తమ ప్రసంగాలను సిద్ధం చేసుకుంటున్నారు.
Narendra Modi
Twitter
Lok Sabha

More Telugu News