Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీ నిర్వహిస్తున్న మహిళకు మందుబాబుల వేధింపులు... ఫిర్యాదు చేయబోతే పోలీసుల అసభ్య ప్రవర్తన!

  • హైదరాబాద్, బాచుపల్లిలో ఘటన
  • కారును ఢీకొట్టిన మందుబాబుల ఆటో
  • ప్రశ్నించినందుకు వేధింపులు
హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ కంపెనీని నిర్వహిస్తున్న ఓ మహిళ, తనకు ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, వారు అసభ్యంగా ప్రవర్తించారట. బాధితురాలి కథనం ప్రకారం, బాచుపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది.

నిన్న రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ రహదారిపై ఉన్న ఓ రెస్టారెంట్ సమీపంలో ఆమె తన కారు నిలిపింది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆటో కారును ఢీకొంది. ఇదేమని ప్రశ్నించినందుకు ఆటోలో ఉన్న మందుబాబులు వీరంగమాడారు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు.

ఇక తనకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లగా, వారు కూడా అసభ్యంగా ప్రవర్తించారు. జరిగిన ఘటనపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితురాలు తెలిపారు. 
Hyderabad
Bachupalli
Harrasment
IT Company

More Telugu News