Telugudesam: కాంగ్రెస్ అడుగుజాడల్లోనే టీడీపీ అవిశ్వాసం: ఏపీ బీజేపీ ఢిల్లీ సమన్వయకర్త

  • అవిశ్వాసంతో ప్రజలను వంచిస్తున్న టీడీపీ
  • కాంగ్రెస్ ఎజెండాను అమలు చేస్తోంది
  • వారికి 145 మంది కూడా లేరు
కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఢిల్లీ సమన్వయకర్త రఘురామ్ తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ అడుగుజాడల్లో టీడీపీ నడుస్తోందనడానికి ఇంత కంటే సాక్ష్యం అక్కర్లేదన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ పెట్టినా, అజెండా మాత్రం కాంగ్రెస్‌దేనని విమర్శించారు. ఇది అనైతికమన్నారు. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉందని తెలిసినా టీడీపీ అవిశ్వాసం నోటీసు ఇచ్చి ప్రజలను మోసం చేస్తోందన్నారు.

150 మంది సభ్యుల బలం కూడా లేని విపక్షాలు ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. విపక్షాలన్నీ కలిపినా 145 మంది సభ్యులకు మించి లేరని, కానీ ప్రభుత్వాన్ని దించేస్తామని అంటున్నారని రఘురామ్ పేర్కొన్నారు. బీజేపీపై విరుచుకుపడే శివసేన కూడా తమ పక్షానే నిలవడం సంతోషంగా ఉందన్నారు.
Telugudesam
BJP
Andhra Pradesh
NDA

More Telugu News