Lok Sabha: రేపు లోక్ సభలో క్వశ్చన్ అవర్ ఉండదు: మంత్రి అనంత్ కుమార్
లోక్ సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న నేపథ్యంలో క్వశ్చన్ అవర్ ఉండదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ పేర్కొన్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరుగుతుందని, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు, ఇతరులతోనూ తాము మాట్లాడామని, తమకు పూర్తి మద్దతు లభిస్తుందని అన్నారు.
కాగా, లోక్ సభలో రేపు ఉదయం 11 గంటలకు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించనున్నారు. టీడీపీ ఎంపీలకు కేటాయించిన సమయం కన్నా అదనపు సమయం లభిస్తే కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు ప్రసంగించే అవకాశాలు ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు.