spy reddy: పార్లమెంటుకు హాజరుకాలేని స్థితిలో టీడీపీ ఎంపీ ఎస్పీవై రెడ్డి

  • ఎస్పీవై రెడ్డికి సహకరించని ఆరోగ్యం
  • నంద్యాలలోనే ఉన్న టీడీపీ ఎంపీ
  • నంద్యాల ఉపఎన్నికలో వీల్ చైర్ లో కూర్చొని ప్రచారం
కేంద్ర ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో రేపు చర్చ జరగబోతోంది. ఈ నేపథ్యంలో తమ ఎంపీలకు టీడీపీ విప్ జారీ చేసింది. కానీ, ఎంపీ ఎస్పీవై రెడ్డి ఇంకా నంద్యాలలోనే ఉన్నారు. పార్లమెంటుకు హాజరుకాలేని స్థితిలో ఆయన ఉన్నారు. ప్రయాణించేందుకు ఆయన ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమధ్య నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఆయన ప్రచారంలో పాల్గొన్నప్పటికీ... వీల్ చైర్ లో కూర్చొనే ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఆయన బయట పెద్దగా కనిపించ లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పార్టీ హైకమాండ్ కూడా ఆయనపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. 
spy reddy
ill

More Telugu News