raghuveera: రేపు ఏపీ వ్యాప్తంగా నిర‌స‌న‌లకు ర‌ఘువీరారెడ్డి పిలుపు

  • లోక్‌సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ  
  • ఈ నేపథ్యంలో కేంద్రంపై రేపు నిరసనలు
  • ఏపీ వ్యాప్తంగా మానవహారం నిర్వహించాలని పిలుపు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశంపై లోక్‌సభలో రేపు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు నిర్వ‌హించాల‌ని కాంగ్రెస్ కార్యక‌ర్త‌ల‌కు, ప్ర‌జాస్వామ్య‌వాద‌ుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు   ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.

ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు విషయంలో మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని జిల్లాలు, నగర కేంద్రాల్లో ‘మానవహారం’ ద్వారా కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేయాలని అన్నారు.
raghuveera
Andhra Pradesh

More Telugu News