rajanianth: రజనీ భార్యగా సిమ్రాన్ .. నెగెటివ్ రోల్ లో నవాజుద్దీన్ సిద్ధిఖీ

  • సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీ 
  • సంగీత దర్శకుడిగా అనిరుథ్ 
  • వేసవికి భారీస్థాయి విడుదల
తెలుగు .. తమిళ భాషల్లో నిన్నటితరం అగ్రకథానాయికగా సిమ్రాన్ ఒక వెలుగు వెలిగింది. ఆ సమయంలో ఆమె చిరంజీవి .. కమల్ వంటి అగ్రస్థాయి హీరోల సరసన నటించింది. కానీ అప్పుడామెకి రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ దక్కలేదు. ఆలాంటి సిమ్రాన్ .. సెకండ్ ఇన్నింగ్స్ లో రజనీ జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.సన్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. రజనీ .. విజయ్ సేతుపతి కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రీసెంట్ గా ఈ సినిమా కోసం సిమ్రాన్ ను .. నవాజుద్దీన్ సిద్ధిఖీని తీసుకున్నారు. రజనీకి భార్యగా సిమ్రాన్ కనిపించనుందని అంటున్నారు. ఇక నవాజుద్దీన్ సిద్ధిఖీ .. నెగెటివ్ పాత్రను చేయనున్నాడని చెబుతున్నారు. అనిరుథ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను వేసవికి విడుదల చేయనున్నారు.   
rajanianth
simran

More Telugu News