parliament: ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు

  • సజావుగా సాగుతున్న లోక్ సభ, రాజ్యసభ
  • ప్రశ్నోత్తరాలను చేపట్టిన సుమిత్రామహాజన్
  • అవిశ్వాసంపై మద్దతు కూడగట్టే పనిలో టీడీపీ ఎంపీలు
పార్లమెంటు ఉభయసభలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు చర్చకు అంగీకరించిన నేపథ్యంలో, విపక్ష సభ్యులంతా సభలో సైలెంట్ గా ఉన్నారు. ఎలాంటి ఆందోళనలు లేకుండా సభ సజావుగా సాగుతోంది. మరోవైపు, అవిశ్వాసంపై ఇతర పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీడీపీ ఎంపీలు బిజీగా ఉన్నారు. యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ కూడా కాంగ్రెస్ ఎంపీలతో ఈరోజు అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. 
parliament
Lok Sabha
Rajya Sabha

More Telugu News