Telugudesam: కేజ్రీవాల్ ను కలిసిన టీడీపీ ఎంపీలు

  • రాష్ట్ర సమస్యలు, కేంద్ర వైఖరిని వివరించిన ఎంపీలు
  • అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలంటూ విన్నపం
  • సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్
అవిశ్వాస తీర్మానంపై వివిధ పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీడీపీ బిజీగా ఉంది. ఈ ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను టీడీపీ ఎంపీలు కలిశారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేజ్రీవాల్ ను కలిసిన వారిలో సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, కొనకళ్ల నారాయణ, శ్రీరాం మాల్యాద్రి, నిమ్మల కిష్టప్పలు ఉన్నారు.

అనంతరం మీడియాతో సుజనా చౌదరి మాట్లాడుతూ, ఏపీ సమస్యలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని కేజ్రీవాల్ కు వివరించామని తెలిపారు. తాము చెప్పిన విషయాలను ఆయన పూర్తిగా అవగాహన చేసుకున్నారని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని ఆయనను కోరామని... ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Telugudesam
mp
kejriwal
no confidence motion

More Telugu News