Vijayawada: విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!

  • విజయవాడలోని ప్రముఖ హోటల్ పై దాడి
  • పట్టుబడ్డ వారిలో బడాబాబుల పుత్రరత్నాలు
  • వివిధ నగరాల నుంచి యువతులను తెప్పించి నృత్యాలు
విజయవాడ భవానీపురం ప్రాంతంలోని ఓ పేరున్న హోటల్ లో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారాన్ని అందుకున్న పోలీసులు, దాడి చేసి 53 మందిని అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి హోటల్ గురించిన సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడి జరుపగా, పలువురు బడాబాబుల పుత్రరత్నాలు అక్కడ పట్టుబడ్డట్టు సమాచారం. దేశంలోని వివిధ నగరాల నుంచి తెప్పించిన అమ్మాయిలు కూడా అక్కడ పట్టుబడగా, వారిని రెస్క్యూ కేంద్రాలకు తరలించారు. ఈ కేసు విషయంలో పెద్దల నుంచి పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Vijayawada
Bhavanipuram
Dance
Arrest

More Telugu News