Thailand: గుహలో అన్ని రోజులు ఎలా ఉన్నామంటే.. వివరించిన థాయ్ బాలలు

  • తొమ్మిది రోజులు వాన నీళ్లే తాగాం
  • గుహను తవ్వి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాం
  • అదో అద్భుత సాహసం
గుహ సందర్శనకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో చిక్కకుకుపోయిన 12 మంది థాయ్ బాలలు, వారి కోచ్ 18 రోజుల తర్వాత క్షేమంగా బయటకు వచ్చారు. థాయ్ నేవీ సీల్స్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి వారిని బయటకు తీసుకువచ్చారు. గుహ నుంచి వారిని బయటకు తీసుకువచ్చిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో అనుకున్న సమయానికి ఒక్క రోజు ముందే వారిని డిశ్చార్జ్ చేశారు.

బుధవారం చిన్నారులంతా తొలిసారి మీడియా ఎదుటకు వచ్చారు. గుహలో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రమాదకరమైన మార్గం నుంచి తమను సురక్షితంగా బయటకు తీసుకురావడాన్ని అద్భుత సాహసంగా అభివర్ణించిన బాలలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు తొమ్మిది రోజులపాటు వాన నీళ్లు తాగినట్టు చెప్పారు. గుహను తవ్వి బయటపడేందుకు ప్రయత్నించినట్టు తెలిపారు. చిన్నారులను అభినందించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Thailand
Football
Boys
Tham luang cave

More Telugu News