vijay devarakonda: 'అర్జున్ రెడ్డి'కి విజయ్ దేవరకొండ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' .. సంచలన విజయం సాధించింది. యూత్ ను ఒక రేంజ్ లో ప్రభావితం చేస్తూ, కొత్త ట్రెండును సృష్టించింది. అలాంటి ఈ సినిమాకి పారితోషికంగా విజయ్ దేవరకొండకి భారీ మొత్తమే ముట్టి ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ సినిమాకి తాను అందుకున్న పారితోషికం కేవలం 5 లక్షలు మాత్రమేనని తాజాగా ఓ సందర్భంలో విజయ్ దేవరకొండ చెప్పాడు.

అయితే ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిన తరువాత, లాభాలలో వాటా ఇచ్చారని అన్నాడు. ఏదేమైనా, ఒక సినిమాను 5 లక్షల పారితోషికానికే విజయ్ దేవరకొండ ఒప్పేసుకోవడం నిజంగా విశేషమేనని చెప్పుకుంటున్నారు. ఈ కంటెంట్ పై నమ్మకంతోనే ఆయన ఓకే చెప్పేసి ఉండొచ్చునని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు.       
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News