narayana: ఇది టీడీపీ సాధించిన ఘన విజయం: మంత్రి నారాయణ

  • అవిశ్వాసంపై చర్చను చేపట్టడం టీడీపీ విజయం
  • బీజేపీ, వైసీపీలను లోక్ సభ సాక్షిగా ఎండగడతాం
  • విజయసాయి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు
లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సుమిత్రామహాజన్ స్వీకరించడం టీడీపీ సాధించిన గొప్ప విజయమని మంత్రి నారాయణ అన్నారు. అవిశ్వాసంపై చర్చలో టీడీపీకి సమయం తక్కువ ఇచ్చినప్పటికీ... ఇతర పార్టీల సహకారంతో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. బీజేపీ-వైసీపీల వైఖరిని లోక్ సభ సాక్షిగా ఎండగడతామని తెలిపారు. బీజేపీ మద్దతుతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని... ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము కోరుతున్నామని చెప్పారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదని విమర్శించారు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు విడదీసి చెబుతామంటూ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వెకిలిగా ఉన్నాయని అన్నారు. 
narayana
bjp
ysrcp
vijaysai reddy
parliament

More Telugu News