ఈ సంవత్సరం కొత్త టెక్ ఉద్యోగాలు అతి తక్కువ: నాస్ కామ్
- ఐటీ రంగంలో వృద్ధి 7.9 శాతంగా అంచనా
- గత సంవత్సరంతో పోలిస్తే 50 వేల వరకూ తగ్గే ఉద్యోగాలు
- క్యాంపస్ రిక్రూట్ మెంట్లు మాత్రం సేమ్
ఇవి ప్రారంభ అంచనాలు మాత్రమేనని, మరింతగా తగ్గవచ్చని కూడా పేర్కొంది. ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్లు గత సంవత్సరంలానే 1.20 లక్షల వరకూ ఉండవచ్చని, 2 నుంచి 8 సంవత్సరాల అనుభవం అవసరమైన ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గుతుందని తెలిపింది. టీసీఎస్ వంటి పెద్ద కంపెనీల్లో అట్రిషన్ రేటు 10 శాతం వరకూ ఉంటుందని, ఇదే సమయంలో రిటెన్షన్ రేటు గరిష్ఠానికి చేరుకుందని, ఈ కారణంతో కూడా ఉద్యోగాల సృష్టిపై ఒత్తిడి ఉందని తెలిపింది.