ntr: మల్టీస్టారర్ పనుల్లో రాజమౌళి .. ఆయన దృష్టి ఆ హీరోయిన్స్ పైనే!

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్ 
  • ఎన్టీఆర్ సరసన కీర్తి సురేశ్
  • చరణ్ జోడీగా పూజా హెగ్డే  
ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా ఒక భారీ మల్టీస్టారర్ ను రూపొందించడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడు. ఒక వైపున కథపై కసరత్తు చేస్తూనే, మరో వైపున ఆయన ఇతర పనులను చక్కబెడుతున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అటు ఎన్టీఆర్ అభిమానులు .. ఇటు చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరి సరసన ఏ హీరోయిన్ చేయనుందా అనే ఆసక్తి కూడా వాళ్లలో ఎక్కువవుతూ వస్తోంది. 'మహానటి' చూసిన దగ్గర నుంచి కీర్తి సురేశ్ ను తన సినిమాలోకి తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నాడనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇక మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలని ఆయన చూస్తున్నాడనేది తాజా సమాచారం. ఆల్రెడీ పూజా హెగ్డేతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని అంటున్నారు. త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే చేస్తోంది కనుక, ఈ సినిమాలో ఆమె చరణ్ జోడీగా కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన కీర్తి సురేశ్ కనువిందు చేస్తుందన్న మాట.    
ntr
charan

More Telugu News