Chandrababu: చంద్రబాబు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు.. ఆయన మనసులో ఏమీ లేదు!: రమణదీక్షితులు

  • ఎస్వీ యూనివర్శిటీలో చంద్రబాబు నాకు జూనియర్
  • ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది
  • ఇతరుల వల్లే ఆయన నాకు వ్యతిరేకంగా ఉన్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి వ్యక్తి అని తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు అన్నారు. చంద్రబాబు తనకు చిన్నప్పటి నుంచి తెలుసని... ఎస్వీ యూనివర్శిటీలో ఆయన తనకు జూనియర్ అని చెప్పారు. ఆయనతో తనకు మంచి సంబంధాలు ఉండేవని... అయితే, కొంత మంది ప్రోద్బలంతోనే ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయన మనసులో మాత్రం ఏమీ లేదని అన్నారు.

 తామిద్దరం శ్రీవేంకటేశ్వరుడి భక్తులమే అని చెప్పారు. తమ ఇద్దరి ఆలోచనలు ఒకటేనని... రాజకీయ నాయకుడిగా రాష్ట్రమంతా బాగుండాలని ఆయన కోరుకుంటారని, స్వామివారి అర్చకుడిగా కొండపై అంతా బాగుండాలని తాను కోరుకుంటానని తెలిపారు. చంద్రబాబును కలిసేందుకు గతంలో తాను చాలాసార్లు ప్రయత్నించానని... అయితే, అపాయింట్ మెంట్ ఇచ్చి కూడా తనను వెనక్కి తిప్పి పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu
ramana deekshitulu

More Telugu News