snake: బంజారాహిల్స్ వాసులను బెంబేలెత్తించిన కొండచిలువ

  • ఆరడుగులు ఉన్న కొండచిలువ
  • వణికిపోయిన స్థానికులు
  • పట్టుకుని కేబీఆర్ పార్క్‌లో వదిలేసిన స్నేక్ టీం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో కొండచిలువ కలకలం రేపింది. రోడ్డు నంబరు 14 సినీ మ్యాక్స్‌ వెనక రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాన రహదారిపై కనిపించిన ఆరడుగుల కొండచిలువను చూసిన జనాలు బెంబేలెత్తిపోయారు. రోడ్డుపై నుంచి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లిన కొండచిలువను చూసిన స్థానికులు వెంటనే స్నేక్‌ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించారు. సంస్థ ప్రతినిధులు వెంటనే అక్కడికి చేరుకుని రాళ్లలో నక్కిన కొండచిలువను పట్టుకుని తీసుకెళ్లారు. అనంతరం కేబీఆర్ పార్క్‌లో వదిలేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
snake
Hyderabad
Banjarahills
python

More Telugu News