Ramayan: రామాయణాన్ని కించపరిచాడంటూ షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌‌పై పోలీసులకు ఫిర్యాదు

  • షార్ట్‌ఫిల్మ్‌తో దెబ్బతిన్న మనోభావాలు
  • అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు బీజేవైఎం ఫిర్యాదు
  • వరుణ్‌పై కేసు నమోదు
రామాయణం మరోమారు వార్తల్లోకి ఎక్కింది. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేశ్ నగర బహిష్కరణకు గురయ్యాడు. ఇప్పుడు రామాయణాన్ని కించపరిచాడంటూ షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ వరుణ్‌పై బీజీవైఎం నాయకులు హైదరాబాదు శివారు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రామాయణాన్ని కించపరిచేలా వ్యవహరించిన అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తీసిన షార్ట్‌ఫిల్మ్‌తో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కాబట్టి వెంటనే అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.
Ramayan
Kathi Mahesh
Director
BJYM

More Telugu News