Rajasthan: రాజస్థాన్ లో మాజీ ఎమ్మెల్యేను తరిమి తరిమి కొడుతున్న ప్రజలు... వీడియో!

  • ప్రజల నిరసన మధ్యకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే రంకేష్ మీనా
  • కొడుతూ తరిమేసిన ప్రజలు
  • రాజస్థాన్ లో ఘటన
  • బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మీనా
ఓటరు మహాశయులకు ఆగ్రహం వస్తే... రాజస్థాన్ లో అదే జరిగింది. దౌసా ప్రాంతంలో జరిగిన ఘటనలో ఓ ఎమ్మెల్యే ప్రజల చేతిలో తన్నులు తిన్న వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తిని ప్రజలు తరిమి తరిమి కొడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కగా, ఇందులో కనిపిస్తున్నది దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ అంటూ ప్రచారం మొదలైంది.

 తెల్లటి కుర్తా, పైజమా ధరించిన వ్యక్తి ప్రజలతో దెబ్బలుతింటూ పరిగెత్తినట్టు కనిపిస్తుండగా, ఇందులో ఉన్నది గంగాపూర్ అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత రంకేశ్‌ మీనా అన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై స్పందించిన శంకర్ లాల్, తన అనుచరులను వీడియోలో ఉన్నది ఎవరో కనుక్కోవాలని ఆదేశించగా, అసలు విషయం తేటతెల్లమైంది. తమ నేత పేరిట నకిలీ వీడియోలు ప్రచారం చేశారంటూ బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు.

కాగా, సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టంపై దాఖలైన పిటిషన్ పై విచారించిన తరువాత చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన సమయంలో నిరసన తెలుపుతుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ప్రస్తుత కాంగ్రెస్‌ నేత, గతంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రంకేశ్‌ మీనా అని తెలుస్తోంది. వీడియో విషయమై రంకేష్‌ ను సంప్రదించగా సమాధానం చెప్పేందుకాయన నిరాకరించారు.
Rajasthan
Rankesh Meena
Congress
Shankarlal Sharma

More Telugu News