dhruv: హీరో విక్రమ్ తనయుడితో శేఖర్ కమ్ముల సినిమా!

  • 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో నటిస్తున్న ధృవ్
  • తెలుగు స్ట్రయిట్ మూవీలో కుమారుడిని నటింపజేసే యోచనలో విక్రమ్
  • డ్యాన్స్ నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం
తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఘన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ లో ఆయన నటిస్తున్నాడు. బాలా దర్శకత్వంలో ప్రస్తుతం ఆ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరోపక్క, తన కుమారుడిని స్ట్రయిట్ తెలుగు మూవీలో నటింపజేసేందుకు విక్రమ్ యత్నిస్తున్నాడు. తనకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో, తన కుమారుడిని కూడా తెలుగు ప్రేక్షకుల చెంతకు తెచ్చే యోచనలో ఉన్నాడు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధృవ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడు. డ్యాన్స్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
dhruv
vikram
tollywood
kollywood
sekhar kammula

More Telugu News