Rita Bhaduri: బాలీవుడ్ నటి రీటా భాదురి మృతి.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూత

  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రీటా
  • గత పదిరోజులుగా ఐసీయూలో
  • ‘అమ్మ’ను కోల్పోయామంటున్న నటులు
గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సీనియర్ నటి రీటా భాదురి(62) సోమవారం రాత్రి కన్నుమూశారు. పాప్యులర్ నటి అయిన రీటా సినిమాలతోపాటు బుల్లితెరపైనా మొన్నటివరకు నటించారు. నేటి మధ్యాహ్నం ముంబైలోని అంధేరీలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆమె మరణం తనను కలచివేసిందని ‘రాజీ’ నటుడు శిశిర్ శర్మ పేర్కొన్నారు. ఓ మంచి వ్యక్తిని కోల్పోయామని పేర్కొన్న ఆయన తమలో చాలామందికి ఆమె అమ్మని అన్నారు. ‘విల్ మిస్ యూ మా’ అని ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు.

కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రీటా రోజు విడిచి రోజు డయాలసిస్ చేయించుకుంటున్నారు. గత పది రోజులుగా ఐసీయూలోనే ఉన్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. 20 వరకు టీవీ షోలతోపాటు సూపర్ హిట్ సినిమాలైన రాజా, జూలీ, బేటా, హీరో నంబర్ 1, విరాసత్ తదితర చిత్రాల్లోనూ నటించారు.
Rita Bhaduri
Actress
Bollywood
Mumbai

More Telugu News