JD(s): కుమారస్వామి కన్నీళ్లను మేము తుడుస్తాముగా...: సుబ్రహ్మణ్యస్వామి వ్యంగ్యం!

  • జేడీ (ఎస్) కష్టాలు ఎంతో కాలం ఉండబోవు
  • ఏడుస్తూ పాలించాల్సినంత అవసరం ఏంటి
  • కుమారస్వామిది మొసలి కన్నీరే
జేడీఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి భావోద్వేగానికి గురై, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తనకు గొంతులో విషాన్ని నింపుకున్నట్టుందని కర్ణాటక సీఎం కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందించారు. కర్ణాటకలో జేడీ (ఎస్) కష్టాలు ఎంతో కాలం ఉండబోవని వ్యాఖ్యానించిన ఆయన, అతి త్వరలోనే కుమారస్వామి కష్టాలను తాము తీరుస్తామని సెటైర్ వేశారు. ఏడుస్తూ పాలించాల్సినంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని ప్రశ్నించిన స్వామి, కుమారస్వామి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శలు గుప్పించారు.
JD(s)
Karnataka
Kumaraswamy
Subrahmanya Swamy

More Telugu News