Hyderabad: కూకట్ పల్లిలో కరక్కాయల పేరిట భారీ మోసం..రూ.5 కోట్ల వరకు టోకరా!

  • సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ ప్రైవేట్ కంపెనీ మోసం
  • 300 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు
  • కిలో కరక్కాయలను పొడి చేసిస్తే రూ.300 ఇస్తామని నమ్మించి మోసం
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కరక్కాయల పొడి వ్యాపారం పేరిట ఓ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ వ్యాపారం పేరిట సుమారు 300 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. కరక్కాయలు పొడి చేసిస్తే కిలోకు రూ.300 చొప్పున ఇస్తామని పెట్టుబడిదారులను నమ్మించి మోసగించింది. అయితే, కరక్కాయలు తమ వద్దే కొనాలని షరతు విధించి.. కిలో కరక్కాయలు రూ.1000 చొప్పున వారికి విక్రయించింది. అయితే, తాము మోసపోయిన విషయం తెలుసుకున్న పెట్టుబడిదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
Hyderabad
karakaya

More Telugu News