టీడీపీతో పొత్తు అంశంపై తులసిరెడ్డి స్పందన!
- టీడీపీతో పొత్తు అవాస్తవం
- టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటే
- ఎన్నికల తర్వాత ఈ పార్టీలు బీజేపీ పంచన చేరుతాయి
టీడీపీ, వైసీపీల విధానాలు ఒకటేనని ఆయన అన్నారు. బీజేపీకి టీడీపీ అధికారిక మిత్రపక్షమైతే, వైసీపీ అనధికార మిత్రపక్షమని చెప్పారు. ఎన్నికల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ఆ రెండు పార్టీలు బీజేపీ పంచన చేరుతాయని చెప్పారు. టీడీపీ తన పేరును 'తెలుగు ద్రోహుల పార్టీ'గా మార్చుకోవాలని సూచించారు. నకిలీ, కబ్జాకోరు పార్టీ వైసీపీ అని విమర్శించారు.