rajani: రజనీ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు!

  • రజనీ హీరోగా కార్తీక్ సుబ్బరాజు మూవీ 
  • ముఖ్యమైన పాత్రలలో సిమ్రాన్ .. కాజల్ 
  • కీలక పాత్రలో విజయ్ సేతుపతి
ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్లో రజనీకాంత్ ఒక సినిమా చేస్తున్నారు. విభిన్నమైన కథాకథనాలతో కూడిన ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కార్తీక్ సుబ్బరాజు .. విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా మరో ముఖ్యమైన పాత్రకి గాను మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ను కార్తీక్ సుబ్బరాజు ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మలయాళ ప్రేక్షకుల హృదయాల్లో ఫాహద్ ఫాజిల్ మంచి మార్కులు కొట్టేశాడు. సహజ నటుడిగా ఆయనకి అక్కడ మంచి క్రేజ్ వుంది. ఈ సినిమాలోని ఒక పాత్రను ఆయనతో చేయిస్తేనే బాగుంటుందని భావించి తీసుకున్నారట. అనిరుథ్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాలో సిమ్రాన్ .. కాజల్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. 
rajani
vijay sethupathi
simran

More Telugu News