Swiss Bank: స్విస్ బ్యాంకు భారతీయుల ఖాతాలో రూ.300 కోట్లు.. తేలుకుట్టిన దొంగల్లా ఖాతాదారులు!

  • స్విస్ బ్యాంకు ఖాతాల్లో రూ.వందల కోట్లు
  • ఎవరివో తెలియడం లేదన్న బ్యాంకు
  • ఆరింటిలో మూడు ఎన్ఆర్ఐలవి
స్విస్ బ్యాంకులో దాచుకున్న రూ.300 కోట్లు ఎవరికీ కాకుండా పోతోంది. భారతీయుల ఖాతాల్లో ఉన్న ఈ సొమ్ము తమదేనని క్లయిం చేయడానికి ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాలేదని స్విస్ బ్యాంకు వర్గాలు తెలపడం చర్చకు దారితీసింది. 2015లో స్విస్ బ్యాంకు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 3,500 ఖాతాల్లో భారతీయులకు చెందినవి మూడు ఖాతాలు కాగా, మూడు ప్రవాస భారతీయులవి. అయితే, అవి తమవేనంటూ ఇప్పటి వరకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో ఈ అనధికారిక ఖాతాల్లో ఉన్న రూ.300 కోట్లు ఎవరివన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది.

ఆ ఖాతాలు తమవే అని చెప్పి ముందుకొస్తే అనవసర ఇబ్బందుల్లో చిక్కుకుంటామనే ఉద్దేశంతో ఖాతాదారులు గుంభనంగా ఉన్నట్టు తెలుస్తోంది. స్విస్ బ్యాంకులో అక్రమంగా సొమ్ము దాచిపెట్టినట్టు తెలిస్తే కఠిన శిక్షలు తప్పవన్న కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఆ రూ.300 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేసుకోవడం లేదని సమాచారం.
Swiss Bank
India
NRI

More Telugu News