tummala: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలుపు మాదే: తుమ్మల ధీమా

షార్ట్స్‌లో చూడండి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కడతారని అన్నారు.

ప్రజలను చైతన్య పరిచేలా బూత్ కమిటీ సభ్యులు పనిచేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని, మరో పద్నాలుగేళ్లు గడిచినా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న మూడు నెలల్లోనే విద్యుత్ కష్టాలను తీర్చామని, ప్రస్తుతం కోటి ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు.
Go Back to Shorts
tummala
Nizamabad District

More Telugu News