kcr: తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవనున్న ఏపీ టీడీపీ ఎంపీలు

  • ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై వివరించనున్న వైనం
  • నేడు, రేపు పలు పార్టీల అధినేతలతో టీడీపీ నేతల భేటీ 
  • కేసీఆర్ తో భేటీ కానున్న అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్ 
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయం గురించి కాంగ్రెస్, బీజేపీ యేతర పార్టీల నేతలను టీడీపీ ఎంపీలు కలిసి వివరించనున్నారు. నేడు, రేపు పలు పార్టీల అధినేతలను టీడీపీ ఎంపీలు కలవనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఏపీ టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, కొనకళ్ల నారాయణ, శివప్రసాద్ తదితరులు కలవనున్నట్టు సమాచారం. చంద్రబాబు రాసిన లేఖతో పాటు విభజన హామీల అమలులో వైఫల్యాలపై రాసిన పుస్తకాన్ని కేసీఆర్ కు అందజేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా, టీడీపీ ఎంపీలు తోట నరసింహం, రవీంద్రబాబు ముంబై వెళ్లారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ తో వీరు భేటీ కానున్నారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే నేతలను టీడీపీ నేత సీఎం రమేష్ కలవనున్నట్టు సమాచారం.
kcr
Telugudesam
Andhra Pradesh

More Telugu News