elections: ఎన్నికల నేపథ్యంలో అయోధ్య తీర్పు పారదర్శకంగా ఉంటే మంచిది: అసదుద్దీన్‌ ఒవైసీ

  • హైదరాబాద్‌లో నిన్న కార్యకర్తలతో షా భేటీ
  • పలు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు
  • మండిపడ్డ అసదుద్దీన్‌ ఒవైసీ
హైదరాబాద్‌లో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమైన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. అయోధ్యలో రామ మందిరంపై పలు వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే రామ మందిర నిర్మాణం ప్రారంభమవుతుందని ఆయన అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

తాజాగా, ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... వచ్చే ఎన్నికలకు ముందే మందిర నిర్మాణం జరుగుతుందని అమిత్‌ షా చెప్పినట్లు తనకు తెలుస్తోందని, అయోధ్య వ్యవహారంలో సుప్రీంకోర్టుకి బదులు, ఆయనే  తీర్పు ఇస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నికల నేపథ్యంలో తీర్పు పారదర్శకంగా ఉంటే మంచిదని పేర్కొన్నారు. 
elections
Asaduddin Owaisi

More Telugu News