kiran kumarreddy: కిరణ్‌ కుమార్‌రెడ్డి టీడీపీలోకి వస్తారని మేమనలేదు: మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వివరణ

  • కిశోర్‌ కుమార్‌రెడ్డి చంద్రబాబుపై నమ్మకంతో టీడీపీలో చేరారు
  • వచ్చే ఎన్నికల్లో కిశోర్‌ టీడీపీ తరఫునే పోటీ చేస్తారు
  • కాంగ్రెస్‌తో టీడీపీ జోడీ కట్టే ప్రసక్తేలేదు
ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌ కుమార్‌రెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరతారంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, ఆయన తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పందిస్తూ, కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వస్తారని తాము ఎన్నడూ చెప్పలేదని అన్నారు. చంద్రబాబుపై నమ్మకంతోనే కిశోర్‌ కుమార్‌రెడ్డి టీడీపీలో చేరారని అన్నారు.

చిత్తూరులో వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కిశోర్‌ టీడీపీ తరఫునే పోటీ చేస్తారని అన్నారు. అలాగే, బీజేపీ, వైసీపీ ఒక్కటైనందునే కాంగ్రెస్‌, టీడీపీ కలుస్తాయనుకోవడం సరికాదని అన్నారు.
kiran kumarreddy
Congress
Telugudesam

More Telugu News