jd lakshminarayana: నాది రైతు పార్టీ.. త్వరలోనే చంద్రబాబును కలుస్తా!: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • రైతు సమస్యలపై చంద్రబాబుతో చర్చిస్తా
  • పరిష్కారం దొరకకపోతే మహారాష్ట్ర తరహాలో పాదయాత్ర  
  • రైతులు సంఘటితంగా ఉంటే కార్పొరేట్ శక్తులను నిలువరించవచ్చు
తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, తనది రైతు పార్టీ అని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కరించేందుకు యత్నిస్తానని చెప్పారు. పరిష్కారం లభించకపోతే రెండో దశలో మహారాష్ట్ర తరహాలో 40 వేల మంది రైతులతో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.

కార్పొరేట్ సంస్థల కారణంగా రైతులు నష్టపోతున్నారని... రైతులు సంఘటితంగా ఉంటే కార్పొరేట్ శక్తులను నిలువరించవచ్చని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.
jd lakshminarayana
Chandrababu
farmers

More Telugu News