tollywood: అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్.. దోషులుగా ప్రకటించిన కోర్టు!

  • పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశం
  • ఈనెల 18న శిక్షను ఖరారు చేయనున్న కోర్టు
  • మహిళలను అక్రమ రవాణా చేశారన్న కోర్టు
అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇందులో నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను అమెరికా కోర్టు దోషులుగా తేల్చింది. ఈనెల 18న వీరికి శిక్షను ఖరారు చేయనుంది. గరిష్టంగా పదేళ్ల వరకు వీరికి శిక్ష పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 ఈవెంట్ల పేరుతో టాలీవుడ్ హీరోయిన్లను అమెరికాకు పిలిపించి, వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు ప్రకటించింది. వీసా పర్మిట్ లను దుర్వినియోగం చేశారని చెప్పింది. అనైతిక కార్యకలాపాల కోసం మహిళలను అక్రమంగా రవాణా చేశారని తెలిపింది.

టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు కోప్రొడ్యూసర్ గా పని చేసిన కిషన్... ఆ తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకు ఉన్న పరిచయాలతో హీరోయిన్లను అమెరికాకు పిలిపిస్తూ, వ్యభిచార దందాను కొనసాగించాడు. కొన్నేళ్లపాటు తన భార్యతో కలసి ఈ దందాను నడిపాడు.
tollywood
america
S*x racket

More Telugu News