somu veerraju: కేంద్రంపై పడి ఏడవడం తప్ప చంద్రబాబుకి మరో పని లేదు: సోము వీర్రాజు ఫైర్

  • కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఎన్నో నిధులు వస్తున్నాయి
  • ఏమీ రావడం లేదని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • ప్రతి కార్యక్రమం తనదే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంపై పడి ఏడవడం తప్ప చంద్రబాబుకు మరో పని లేదని ఆయన విమర్శించారు. కేంద్రం నుంచి ఏపీకి ఎన్నో నిధులు వస్తున్నా... ఏమీ రావడం లేదంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలను నెరవేర్చే విషయంలో కేంద్రం వెనకడుగు వేయదని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే అని ధ్వజమెత్తారు.

ప్రతి రోజు పోలవరం ప్రాజెక్టు పనులను సమీక్షిస్తూ, పోలవరం మాదే అని చెప్పుకునే హక్కు చంద్రబాబుకు లేదని సోము వీర్రాజు అన్నారు. ప్రతి కార్యక్రమాన్ని తనదే అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగభృతి ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. 
somu veerraju
Chandrababu
polavaram

More Telugu News