ayodhya: బాబ్రీ మసీదే లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్!

  • అయోధ్య రామ జన్మభూమి
  • అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుంది
  • బాబర్ సానుభూతిపరులు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండండి
రామ మందిరం, బాబ్రీ మసీదు గురించి షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు బాబ్రీ మసీదే లేదని ఆయన స్పష్టం చేశారు. అయోధ్యలో ఉన్నది మసీదు కాదని... అది రామ జన్మభూమి అని తెలిపారు. అక్కడ రామ మందిరం మాత్రమే నిర్మించబడుతుందని... బాబర్ సానుభూతిపరులంతా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.

వసీం రిజ్వీ ఇటీవలి కాలంలో వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లిం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. మదర్సా వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లకు లేఖలు కూడా రాశారు.

ఇక అయోధ్యలో రామ మందిరాన్ని వ్యతిరేకిస్తున్న వారంతా పాకిస్థాన్ కు వెళ్లిపోవాలని కూడా అన్నారు. ఇదే సమయంలో రిజ్వీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రిజ్వీ వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు.
ayodhya
ram janma bhoomi
babri masjid
babar
shia
wasim razvi

More Telugu News