Chandrababu: 'మోదీ మోదీ' అంటూ బీజేపీ కార్యకర్తల నినాదాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన గడ్కరీ!

  • విశాఖలో చంద్రబాబుతో కలసి పాల్గొన్న గడ్కరీ 
  • ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా వ్యవహరించడం సరికాదని వ్యాఖ్య
  • జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు గడ్కరీ శంకుస్థాపన
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విశాఖపట్నంలో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేయడంతో వారిపై నితిన్‌ గడ్కరీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా వ్యవహరించడం సరికాదని అన్నారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏపీలో క్రూయిజ్‌ పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఆటోమొబైల్‌ తయారీ రంగంలో ఐదేళ్లలో భారత్‌ అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు. ఏపీలో రైతుల ద్వారా బయో ఇథనాల్‌ తయారీని ప్రోత్సహించాలని, వ్యవసాయ రంగాన్ని ఇంధన తయారీలో కీలకం చేయాలని, ఆ దిశగా ఏపీ సర్కారు చర్యలు తీసుకోవాలని చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Chandrababu
Andhra Pradesh
Narendra Modi

More Telugu News