సినిమా నచ్చిందన్న చరణ్ .. థ్యాంక్స్ చెప్పిన కల్యాణ్ దేవ్!
- ఓ వైపున చిరంజీవి అభినందనలు
- మరో వైపున చరణ్ ప్రశంసలు
- సంతోషంలో కల్యాణ్ దేవ్
ఇక ఈ సినిమా చూసిన చరణ్ కూడా బాగుందంటూ కల్యాణ్ దేవ్ ను మెచ్చేసుకున్నాడు. దాంతో ఈ సినిమా నచ్చిందని చెప్పినందుకు థ్యాంక్స్ అనీ .. తనకి చాలా సంతోషంగా ఉందని కల్యాణ్ దేవ్ సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలలో మరింత ఉత్సాహంగా కల్యాణ్ దేవ్ పాల్గొంటున్నాడు. మరో వైపున ఆయన రెండవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.