సినిమా నచ్చిందన్న చరణ్ .. థ్యాంక్స్ చెప్పిన కల్యాణ్ దేవ్!

  • ఓ వైపున చిరంజీవి అభినందనలు 
  • మరో వైపున చరణ్ ప్రశంసలు 
  • సంతోషంలో కల్యాణ్ దేవ్  
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రూపొందిన 'విజేత' సినిమాకి, అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. లుక్ పరంగా .. నటన పరంగా కల్యాణ్ దేవ్ మంచి మార్కులు కొట్టేశాడు. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో కల్యాణ్ దేవ్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా చూసిన చిరంజీవి .. కల్యాణ్ నటన పట్ల సంతోషాన్ని .. సంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా చూసిన చరణ్ కూడా బాగుందంటూ కల్యాణ్ దేవ్ ను మెచ్చేసుకున్నాడు. దాంతో ఈ సినిమా నచ్చిందని చెప్పినందుకు థ్యాంక్స్ అనీ .. తనకి చాలా సంతోషంగా ఉందని కల్యాణ్ దేవ్ సమాధానమిచ్చాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలలో మరింత ఉత్సాహంగా కల్యాణ్ దేవ్ పాల్గొంటున్నాడు. మరో వైపున ఆయన రెండవ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.   
Go Back to Shorts
kalyan dev
malavika nair

More Telugu News