Rahul Gandhi: రాహుల్‌ గాంధీ ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేరుస్తా: కిరణ్‌ కుమార్‌రెడ్డి

  • రాహుల్‌ని ప్రధానిని చేయడానికి కృషి చేస్తాం
  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం 
  • విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలం
  • కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన నేతలతోనూ మాట్లాడుతున్నాం

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తనకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని నెరవేరుస్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. ఈరోజు ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కిరణ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఏపీకి న్యాయం జరుగుతుందని, విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు.

కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన నేతలతోనూ తాను మాట్లాడుతున్నానని, రాహుల్‌ నాయకత్వంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తామని కిరణ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయన నాయకత్వంలోనే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందని, తనకు కాంగ్రెస్ పార్టీ వల్లే ఈ గుర్తింపు వచ్చిందని తెలిపారు.


  • Loading...

More Telugu News