sandalwood: నాకు చెడ్డ పేరు తెచ్చేందుకు కొందరు తప్పుడు పోస్టులు పెడుతున్నారు: కన్నడ హీరో గణేష్ భార్య

  • కెంపేగౌడను కించపరుస్తూ, శిల్ప ఫొటోను అప్ లోడ్ చేసిన దుండగులు
  • పోలీసులను ఆశ్రయించిన శిల్ప
  • తనకు చెడ్డ పేరు తీసుకురావడానికి కొందరు యత్నిస్తున్నారంటూ ఫిర్యాదు
కన్నడ ప్రముఖుడు, దివంగత కెంపేగౌడకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేసి, తన ఫొటోను అప్ లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నడ హీరో గణేష్ భార్య శిల్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెంపేగౌడ కంటే గొప్పవారు, గొప్ప పనులు చేసిన వారు కర్ణాటకలో చాలా మంది ఉన్నారని... సిల్క్ యూనివర్శిటీకి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం లేదంటూ కామెంట్ పెట్టి, శిల్ప ఫొటోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో, ఆమెపై కన్నడిగులు మండిపడుతున్నారు. కెంపేగౌడపై తనకు అపారమైన గౌరవం ఉందని... ఆయనను అవమానించాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని శిల్ప చెప్పారు. కావాలనే కొందరు తనకు చెడ్డ పేరు తీసుకురావాలని యత్నిస్తున్నారని... ఇందులో భాగంగానే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఈ పనులు చేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
sandalwood
ganesh
silpa
social medea
kempe gowda

More Telugu News