FIFA: 'హాట్' మహిళలను జూమ్ చేసి చూపించొద్దు: బ్రాడ్‌కాస్టర్లకు ఫిఫా ఆదేశాలు

  • ‌మ్యాచుల్లో హాట్ హాట్‌‌గా దర్శనమిస్తున్న మహిళలు
  • ఫుట్‌బాల్‌లో సెక్సిజాన్ని సహించబోమన్న నిర్వాహకులు
  • వారిని చూపించవద్దంటూ ఆదేశాలు

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జోరుగా సాగుతోంది. ఫైనల్ దశకు చేరుకున్న టోర్నీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మ్యాచ్‌లను పరోక్షంగా వీక్షిస్తున్నారు. ఇక టోర్నీ జరుగుతున్న రష్యాలో అభిమానులు ‘ఫిఫా’ ఫీవర్‌తో ఊగిపోతున్నారు‌. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మహిళా అభిమానుల్లో కొందరు హాట్ హాట్‌గా పోజిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్లు వారిని జూమ్ చేసి చూపిస్తున్నారు.

ఈ విషయాన్ని గమనించిన ఫిఫా నిర్వాహకులు బ్రాడ్‌కాస్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై అటువంటి పనులు చేయవద్దని, హాట్ మహిళలను జూమ్ చేసి చూపించవద్దని ఆదేశించారు. ఫుట్‌‌బా‌ల్‌లో సెక్సిజాన్ని సహించబోమన్న నిర్వాహకులు ఇకపై ఇటువంటివి చూపించవద్దని తేల్చి చెప్పారు. అయితే, సె‌క్సిజమ్‌ను అణచివేయాలన్నది అధికారిక పాలసీ కాదని, ఇది కేవలం అభ్యర్థన మాత్రమేనని వివరించారు.

  • Loading...

More Telugu News