gas: తాడిపత్రి ఉక్కు కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌.. ఆరుగురి మృతి

షార్ట్స్‌లో చూడండి
అనంతపురం జిల్లా తాడిపత్రికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గెరుడౌ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కర్మాగారంలో ఒక్కసారిగా గ్యాస్‌ లీకై ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించిన కర్మాగార సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై, మృతుల వివరాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.      
Go Back to Shorts
gas
Anantapur District

More Telugu News