saidharam tej: సాయిధరమ్ తేజ్ హీరోగా 'భగవద్గీత సాక్షిగా'

  • కొత్త దర్శకుడితో సాయిధరమ్ తేజ్ 
  • నిర్మాతగా 'ఠాగూర్' మధు 
  • త్వరలోనే పూర్తి వివరాలు
సాయిధరమ్ తేజ్ కి కొంతకాలంగా హిట్ లేకపోవడం ఆయనతో పాటు అభిమానులను కూడా నిరాశకు గురిచేస్తోంది. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో ఆయన వినాయక్ తో సినిమా చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక ఇటీవల వచ్చిన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా కూడా ఆయనకి విజయాన్ని అందించలేకపోయింది.

 ఈ నేపథ్యంలో ఆయన ఓ కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా గోపాల్ అనే దర్శకుడు తేజుకి ఒక కథ వినిపించగా .. కొత్తగా అనిపించడంతో ఓకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమాకి 'భగవద్గీత సాక్షిగా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. 'ఠాగూర్' మధు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.     
saidharam tej

More Telugu News