paripoornananda: పరిపూర్ణానందపై సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు బహిష్కరణ విధించడానికి కారణం ఏమిటంటే.!

  • పరిపూర్ణానందను ఇదివరకే బహిష్కరించిన హైదరాబాద్
  • సైబరాబాదులో ఉండేందుకు టికెట్ బుక్ చేసుకున్న పరిపూర్ణానంద
  • అలర్ట్ అయిన పోలీసులు
హైదరాబాదు నుంచి స్వామి పరిపూర్ణానందను ఆరు నెలల పాటు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఈరోజు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు కూడా ఆయనపై బహిష్కరణ విధించాయి. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. ఈరోజు మళ్లీ హైదరాబాద్ వచ్చేందుకు పరిపూర్ణానంద ప్రయత్నించారు.

మధురపూడి విమానాశ్రయం నుంచి హైదరాబాదుకు ఆయన టికెట్ బుక్ చేసుకున్నారు. తన బహిష్కరణ కేవలం హైదరాబాదు వరకే పరిమితం కావడంతో... సైబరాబాద్ పరిధిలో ఉండేందుకు ఆయన వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు కూడా అప్రమత్తమై ఆయనపై నిషేధించాయి. 
paripoornananda

More Telugu News