Yanamala: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదు: యనమల రామకృష్ణుడు

  • మోదీకి మద్దతు తెలపను అని జగన్‌, పవన్‌ అనట్లేదు
  • బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని అనుకుంటున్నారు
  • బీజేపీతో కుమ్మక్కయి జమిలి ఎన్నికలకు జగన్‌ జై కొట్టారు
ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం కావాలని, తమ ప్రభుత్వం నాలుగేళ్లుగా అవే చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాము ఎన్డీఏలోంచి ఇలా బయటకు రాగానే వైసీపీ అధినేత జగన్‌ అందులో చేరారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలకు మద్దతు తెలపను అని జగన్‌, పవన్‌ అనట్లేదని అన్నారు. బీజేపీతో కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని వారు అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీతో కుమ్మక్కయినందుకే జమిలి ఎన్నికలకు జగన్‌ జై కొట్టారని అన్నారు. తనకు ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని యనమల అన్నారు.    
Yanamala
Andhra Pradesh
Telugudesam

More Telugu News