nitish kumar: నితీష్ కుమార్ తో కలసి అల్పాహారం స్వీకరించిన అమిత్ షా!

షార్ట్స్‌లో చూడండి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అల్పాహార చర్చలు జరిపారు. జేడీయూ, బీజేపీల మధ్య బంధాలు కొంచెం బలహీనమయ్యాయనే వార్తలు వస్తున్న తరుణంలో వీరి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. 2019 ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ రాత్రికి విందు సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.

 దీనికి ముందు బీహార్ బీజేపీ నేతలతో భేటీ అయి... క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితిపై అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత బీజేపీ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, రానున్న ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య అగాధం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నితీష్ తో అమిత్ షా భేటీ అయ్యారు.
Go Back to Shorts
nitish kumar
amit shah

More Telugu News