ritish deshmukh: రాజకీయాల్లోకి రానున్న జెనీలియా భర్త

  • లాతూర్ నుంచి పోటీ చేసే యోచనలో రితీష్
  • 'హౌస్ ఫుల్ 4 లో నటిస్తున్న' రితీష్
  • రితీష్ తండ్రి మహారాష్ట్ర మాజీ సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్
సినీ నటి జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు సమాచారం. పలు సినిమాల్లో నటించిన రితీష్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో కలిసి 'హౌస్ ఫుల్ 4' సినిమాలో నటిస్తున్నాడు. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన సన్నాహకాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై రితీష్ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ కుమారుడే రితీష్ దేశ్ ముఖ్ అన్న సంగతి తెలిసిందే. 
ritish deshmukh
jenelia
politics
Bollywood

More Telugu News