Expulsion: కాకినాడ శ్రీపీఠంలో పరిపూర్ణానందకు భక్తుల ఘనస్వాగతం!

  • హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి
  • కాకినాడలోని పీఠానికి పరిపూర్ణానంద
  • దిష్టి తీసి స్వాగతం పలికిన సిబ్బంది
హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన శ్రీపీఠం పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామికి కాకినాడలోని శ్రీపీఠం ఘనస్వాగతం పలికింది. బుధవారం తెల్లవారుజామున పరిపూర్ణానందను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు, ఆయన్ను 24 గంటల్లో నగరం విడిచిపెట్టాలని ఆదేశిస్తూ, వెంటనే తీసుకెళ్లి సరిహద్దుల వద్ద ఏపీ పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వారు కాకినాడలో ఆయన నిర్వహణలో ఉన్న పీఠానికి తరలించారు. కాకినాడకు పరిపూర్ణానంద చేరుకునే సరికి చీకటిపడింది. జోరున వర్షం కురుస్తోంది. ఆ సమయంలోనూ ఆయన్ను చూసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పీఠం సిబ్బంది ఆయనకు దిష్టితీసి, హారతిచ్చి స్వాగతం పలికారు.
Expulsion
Kakinada
Sri Peetham
Paripoornananda

More Telugu News