Chandrababu: ఇది సమష్టి విజయం..ఈవోడీబీలో అగ్రస్థానంలో నిలవడంపై చంద్రబాబు

  • చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉండగానే ర్యాంకుల ప్రకటన
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రస్థానం
  • సంతోషంగా ఉందన్న చంద్రబాబు
సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనను ముగించుకుని రాష్ట్రంలో అడుగుపెట్టగానే శుభవార్త విన్నానని ఆయన పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో ఏపీ మరోసారి సత్తా చాటిందని అన్నారు. ఇది సమష్టి విజయమని పేర్కొంటూ ట్వీట్ చేశారు

ముఖ్యమంత్రి సింగపూర్‌లో ఉండగానే కేంద్రం ఈ ర్యాంకులు ప్రకటించింది‌. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ తొలి స్థానంలో నిలవగా, తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడాన్ని ప్రశంసిస్తూ తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు.  
Chandrababu
Andhra Pradesh
EODB

More Telugu News