kanna: రాజకీయాల కోసం ఆ గుండెను పీకేయొద్దు: కన్నా లక్ష్మీనారాయణ

  • ‘పోలవరం’ ఏపీకి గుండె లాంటిది
  • ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీకి కేంద్రం పైసా కూడా బాకీ లేదు
  • కేంద్రం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్రం సమన్వయకర్త మాత్రమే
‘పోలవరం’ ఏపీకి గుండె లాంటిదని, ఆ గుండెను రాజకీయాల కోసం పీకేయొద్దని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏపీకి పైసా కూడా బాకీలేదని, అసలు, ఈ ప్రాజెక్టుతో రాష్ట్రానికి సంబంధమేమీ లేదని అన్నారు. కేంద్రం, కాంట్రాక్టర్ల మధ్య రాష్ట్రం సమన్వయకర్త మాత్రమేనని, నిర్దేశించిన గడువు లోగా పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేస్తుందని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం పెత్తనమేంటని ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతున్నామనే బాధతోనే తమపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
kanna
polavaram

More Telugu News